సిసిఎల్ 3 ఫైనల్లో తెలుగు వారియర్స్

Publish Date:Mar 10, 2013

 

 

Celebrity Cricket League, Celebrity Cricket League 3, Celebrity Cricket League final

 

 

సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ 3లో టాలీవుడ్ టీం తెలుగు వారియర్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో వీర్ మరాఠీ జట్టుపై 75 పరుగుల తో విజయం సాధించి బెంగళూరులో ఆదివారం జరిగే ఫైనల్లో కర్ణాటక బుల్‌డోజర్స్‌తో తలపడడానికి సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన మరాఠీ జట్టు పూర్తి ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేయగలిగింది. మంజ్రేకర్ 13, జాదవ్ 19 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. గిరి, ఆదర్శ్, తేజ తలా రెండు వికెట్లు పడగొట్టారు.


టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్.. ప్రిన్స్ 42 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఆదిత్య 52 బంతుల్లో 7 ఫోర్లతో 59 నాటౌట్ గా నిలవడంతో వారియర్స్ జట్టు 20 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి154 పరుగులు చేశారు. పవర్‌ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆదిత్య, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రిన్స్ నిలిచారు.