TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రత్తిపాడులో అభ్యర్థులే ఓటెయ్యలేదా?

Published on: Thu Jun 14, 2012 10:42AM

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే ఓట్లేయ్యలేని నియోజకవర్గంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు చరిత్రపుటల కెక్కింది. ఈ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సుధాకరబాబు స్వస్థలం నాదేండ్ల మండలం తూబాడు. దీంతో ఆయనకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓటు లేదు. ఆ తరువాత తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వీరయ్యది కూడా ఈ నియోజకవర్గం కాదు. ఆయన గుంటూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఏసుభక్తనగర. చివరిగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత. ఆమె ఓటు ఫిరంగిపురంలో ఉంది. దీంతో ఆమె అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేక ఓటు హక్కు వదులుకోవాల్సి వచ్చింది. పోటీలో ఉన్న మూడు ప్రధానపార్టీల అభ్యర్థులూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓటెయ్యలేదన్న సమాచారం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.