Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం.. మహారాష్ట్రలో ఆరుగురు మృతి.!
posted on: Jul 31, 2026 10:03AM
.webp)
నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పలువురు భవన శిధిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ దుర్ఘటనమహారాష్ట్ర భివండి ప్రాంతంలో అర్దరాత్రి దాటిన తరువాత జరిగింది. ఘటన జరిగిన సమయంలో భవనంలో వారంతా గాఢ నిద్రలో ఉండటం వల్లే ప్రాణనష్టం జరిగిందని భావిస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో భవనంలో పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు భవనం ఒకవైపునకు ఒరిగినట్లు కొందరు గమనించిన కొందరు భవనం నుంచి బయటకు వచ్చేశారు.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకూ శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళను ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సురక్షఇతంగా బయటకు తీశారు. శిథిలాల నుంచి ఆరు మృతదేహాలను వెలికి తీశారు.
Bhiwandi building collapse, Thane building accident, NDRF rescue operation Bhiwandi, Telugu One






