ఏపీకి అన్యాయంపై కేవీపీ నిరసన

2018-19 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడంపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో నిరసన వ్యక్తం చేశారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే పోడియంలోకి దూసుకెళ్లిన కేవీపీ.. సేవ్ ఆంధ్రప్రదేశ్... సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతూ.. పెద్దగా అరిచారు. ఈలోగా మరికొంతమంది ఆయనకు జత కలిసి గొంతెత్తడంతో.. సభలో గందరగోళం నెలకొంది. డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రశాంతంగా ఉండాలని పదేపదే కోరినప్పటికీ.. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.