జెసి..బొత్స ఫోన్ వార్

posted on: Oct 28, 2013 3:17PM

 

Botsa Satyanarayana, jc diwakar reddy, sonia gandhi, jagan mohan reddy,  jc diwakar reddy Botsa Satyanarayana

 

 

జగన్‌తో కాంగ్రెస్ కుమ్మక్కైందన్న జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జేసీతో ఫోన్‌లో సంభాషించిన బొత్స ఇలా మాట్లాడటం సరికాదనని అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. బొత్స ఫోన్‌పై జేసీ తీవ్రంగా స్పందించారు. తమని గెటౌట్ అని అంటున్నారా అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్‌ను వీడేవాడిని కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోనే పుట్టా...కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. జరుగుతున్న పరిణామాలపైనే తన ఆవేదన అని జేసీ దివాకర్‌రెడ్డి తెలుపగా, అలాంటి వ్యాఖ్యలు సరికాదని బొత్స అన్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...