TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బోస్ఫరస్ జలసంధికూడా సురక్షితం కాదు.. నల్ల సముద్రంలో రష్యా నౌకపై డ్రోన్ దాడి

Published on: Fri Mar 27, 2026 9:48AM

 

ప్రపంచంలో చమురు రవాణాకు సురక్షితమైన జల మార్గం ఏదీ లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హర్మూజ్ జలసంది మూసివేతతో బోస్ఫరస్ జలసంధి గుండా రష్యా చమురు రవాణా సురక్షితం అన్న భావనను పూర్వపక్షం చేస్తూ తాజాగా జరిగిన డ్రోన్ దాడి నల్ల సముద్రం గుండా చమురురవాణాపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. తాజాగా రష్యా నుంచి ముడి చమురుతో బయలు దేరిన నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ కు అతి సమీపంలో. అదీ అత్యంత కీలకమైన బోస్ఫరస్ జలసంధి వద్ద జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.  

రష్యా నుంచి టర్కీకి ముడి చమురు రవాణా చేస్తున్న నౌకపై జరిగిన దాడిని టర్కీ థృవీకరించింది.  ఈ దాడిలో నౌకలోని ఇంజిన్ దెబ్బతిని భారీ నష్టం వాటిల్లింది.  ఈ దాడి జరిగిన బోస్ఫరస్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గం కావడం గమనార్హం. రష్యా  నుంచి చమురు ఎగుమతులకు ఇది అత్యంత కీలకం కూడా.  ఇలాంటి ప్రాంతంలో డ్రోన్ దాడులు జరగడం వల్ల రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.

 ఈ దాడికి కారణం ఎవరు అన్నది వెంటనే తెలియరాలేదు. అలాగే ఈ దాడిలో ప్రాణనష్టం జరిగిందా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు. ఈ దాడితో ఈ మార్గం గుండా వెళ్లే నౌకలను రష్ష్యా అప్రమత్తం చేసింది.  అదనపు భద్రత లేకుండా ఈ మార్గం గుండా నౌకాయానానికి అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఆ దిశగా టర్కీ ఇప్పటికే చర్యలు చేపట్టింది.