జర్నలిస్ట్ డ్రస్సింగ్ పై బాంబే హైకోర్టు అభ్యంతరం...!

 

జీన్సు, టీషర్టు ధరించి కోర్టు విచారణకు హాజరైన ఓ జాతీయ ఛానెల్‌ జర్నలిస్ట్‌ డ్రస్సింగ్ పై బాంబే హైకోర్టు ఆభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు సంగతేంటంటే...ఇటీవల మహారాష్ట్రలో జరిగిన వైద్యుల సమ్మెను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటిషన్ విచారణ సమయంలో ఓ చానెల్‌ జర్నలిస్టు జీన్స్‌, టీషర్టుతో కవరేజ్‌ కోసం కోర్టుకు వెళ్లారు.  అదే సమయంలో జర్నలిస్టును గమనించిన న్యాయమూర్తులు జస్టిస్‌ మంజులా ఛెల్లూర్‌, జస్టిస్‌ జీఎస్‌ కులకర్ణి ‘జర్నలిస్టులు జీన్సు, టీషర్టు ధరించి కోర్టుకు ఎలా వస్తారు?’ అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా జర్నలిస్ట్‌లకు డ్రెస్‌కోడ్‌ ఉందా అని ముంబయి సివిక్‌ బాడీ కౌన్సిల్‌ ఎస్‌ఎస్‌ పకాలేను కూడా ప్రశ్నించారు. కాగా కోర్టు ప్రాంగణంలోకి వచ్చే వారు డ్రెస్‌ కోడ్‌తో రావాలని బాంబే హైకోర్టు 2011లో నిబంధనలు విధించిన సంగతి విదితమే.