TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ రోజే ఆకాశంలో బ్లూ మూన్

Published on: Fri Aug 31, 2012 3:16PM

Blue moon sighting today, blue moon today, Blue Moon 2012, Full Blue Moon todayఈ రోజు ఆకాశంలో కనిపించే చంద్రుడికి ఓక ప్రత్యేకత ఉంది. దాన్ని బ్లూ మూన్ అంటారు. ఆకాశంలో బ్లూ మూన్ 2.5 ఏళ్లకో సారి కనిపిస్తుంది. అది ఈ రాత్రి కనువిందు చేయనుంది. ఏడాదిలో 12 పూర్ణిమలకు బదులు 13 పూర్ణిమలు వచ్చినప్పుడు బ్లూ మూన్ ఆకాశం మీద వస్తుంది. అయితే మిగతా రోజుల్లో కన్నా కాస్తా స్వచ్ఛంగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ పేరు తొలిసారి రైతు పంచాంగంలోని కనిపిస్తుంది. రైతు పంచాంగం ఏడాదికి 12 పూర్ణచంద్రులను లెక్కిస్తుంది. ఓ ఏడాదిలో 12కు బదులు ఒకటి ఎక్కువగా పూర్ణ చంద్రుడు రావడాన్ని రైతు గమనించాడు. ఏడాదిలో అదనంగా వచ్చిన పూర్ణ చంద్రుడిని పంచాంగకర్త బ్లూ మూన్ అని పిలిచాడు. ఈ రోజు బ్లూ మూన్ చూడకపోతే తరువాత వచ్చే బ్లూ మూన్ కోసం 2015 వరుకు ఆగాల్సిందే.