తృణమూల్ కు సేమ్ టు సేమ్ గా బీజేపీ పాలన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ?
Published on: Sat Aug 22, 2026 10:08AM

పశ్చిమ బెంగాల్ లో దశాబ్దంన్నర పాటు అధికారంలో లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి.. బెంగాల్ గడ్డపై తొలిసారి అధికారం చేజిక్కించుకున్న బీజీపీ ఇప్పుడు అంతర్గత సవాళ్లతో సతమతమౌతోంది. అవినీతి, కట్ మనీ, సిండికేట్ సంస్కృతిని అంతం చేస్తామంటూ ప్రజల మద్దతు పొందిందో.. సరిగ్గా అదే సంస్కృతి ఇప్పుడు బీజేపీలో పేరుకుపోతోంది. పశ్చిమ బెంగాల్ లో అధికార పగ్గాలు చేపట్టిన మూడంటే మూడు నెలల్లోనేూ బీజేపీ నేతలు, శ్రేణులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పై ఏ ఆరోపణలైతే చేసిందో సరిగ్గా అవే ఆరోపణలను బీజేపీ ఇప్పుడు ఎదుర్కొంటోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బెంగాల్ లో బీజేపీ తృణమూలీకరణ చెందిందని ఈ ఆరోపణలు తేటతెల్లం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తుఫాన్గంజ్ ప్రాంతంలో బీజేపీ మండల కమిటీ ఉపాధ్యక్షుడు అక్రమ వసూళ్లకు సంబంధించిన కిడ్నాప్, దాడి కేసులో అరెస్టయ్యారు. అలాగే.. బంకురా జిల్లాలో ఒక రియల్ ఎస్టేట్ ప్రమోటర్ నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేశారనే తీవ్రమైన ఫిర్యాదుపై కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదైంది. ఇవి రెండూ మచ్చుకు మాత్రమే.. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఆక్రమణలు, కట్ మనీ డిమాండ్లు వంటి వ్యవహారాలలో బీజేపీ నేతలు, శ్రేణులు తలమునకలై ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఆరోపణలు, విమర్శలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య.. పార్టీ నేతలు, శ్రేణులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చే వరకూ పరిస్థితి వచ్చిందంటూ వ్యవహారం ఎంత శ్రుతి మించిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే.. పార్టీ అంతర్గత క్రమశిక్షణ విషయంలో జీరో టాలరెన్స్' విధానాన్ని పాటిస్తామని సమీక్ భట్టాచార్య పార్టీ శ్రేణులూ, నేతలకు వార్నింగ్ ఇచ్చారు. . తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ లకు అవినీతి విషయంలో, దాడులు, దౌర్జన్యాల విషయంలో ఏ మంత తేడా లేదన్నది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో జనం భావిస్తున్న పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అక్రమ వసూళ్లు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ నుంచి పాతిక మంది సస్పెండయ్యారు. 300 మందికి పైగా బీజేపీ సభ్యులు షోకాజ్ నోటీసులు అందుకున్నారు.
అయితే క్రమశిక్షణ చర్యల దారి క్రమశిక్షణ చర్యలదే.. అన్నట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం వెనుక నాటి అధికార టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే కారణం తప్ప.. క్షేత్రస్థాయిలో బీజేపీకి సొంతంగా పార్టీ నిర్మాణం లేదనీ పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే.. గతంలో టీఎంసీతో సంబంధాలు ఉన్న వారిని బీజేపీ కలుపుకుందనీ దీంతో రాష్ట్రంలో బీజేపీ పాలన మమతా బెనర్జీ మోడల్ పాలనగానే సాగుతోందనీ పరిశీలకులు అంటున్నారు.
BJP Rule in West Bengal, Bengal Political News, Trinamoolisation of BJP, Cut Money Controversy,TeluguOne


