బిజెపి తెలంగాణ జపం
Published on: Thu Nov 1, 2012 6:10PM

ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ని నెత్తినేసుకుని ఊరేగిన జాతీయ పార్టీ బీజేపీ.. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఈ మాటని స్పష్టంగా ప్రకటించారుకూడా.. తర్వాత కాలం కలిసిరాక బిజెపి ప్రాభవం కాస్తా జారిపోయింది. ప్రాంతీయపార్టీల స్థాయికి చేరింది. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ మాట ఎందుకు గుర్తు రాలేదు స్వామీ అని అద్వానీని నిలదీస్తే, అప్పట్లో బాబు కలిసిరాలేదుగానీ లేకపోతే ఈపాటికి తెలంగాణ వచ్చుండేదని సమాధానమిచ్చారు. నెపాన్ని పూర్తిగా బాబు మీదికి తోసేశారు.
అప్పట్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణకి పూర్తిగా వ్యతిరేకం. ప్రస్తుతం ట్రెండ్ మారింది కాబట్టి అటూఇటూ తలఊపక తప్పని పరిస్థితి. బిజెపి మాత్రం ఇప్పటికీ ఆదే జపాన్ని కంటిన్యూ చేస్తోంది. కేంద్రంలో ఈసారి తాము అధికారంలోకొస్తే తెలంగాణ ఇచ్చి తీరతామని గట్టిగానే చెబుతున్నా ఆ పార్టీకి ఓట్లేసేవాళ్లే కరువైపోయారు.


