TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

"భారత్‌ మాతా కీ జై" అనని వాళ్లంతా పాకిస్థాన్‌ వాళ్లే...

Published on: Tue Feb 27, 2018 10:10AM

 

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. బుక్ అవ్వడం బీజేపీ నేతలకు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడూ వివాదాస్సద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు.  గత నెలలో బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మాట్లాడుతూ ‘మత ప్రాతిపదికన దేశాన్ని విభజించింది ముస్లింలే. కాబట్టి వారంతా దేశం వదిలి వెళ్లిపోవా’లని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆతరువాత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ భారతీయులంతా రాముడి వారసులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా అదే పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే బైరియా సురేంద్ర నారాయణ్‌ సింగ్‌ బాలియాలో జరిగిన బహిరంగ సభలో ‘భారత్‌ మాతా కీ జై’ అని నినదించని వాళ్లందరూ పాకిస్థాన్‌ కు చెందిన వాళ్లేనని వ్యాఖ్యానించి మరో వివాదం రేపారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.