Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భద్రాచలం ఆలయ ఈవోపై దాడి
posted on: Jul 8, 2025 3:02PM

భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడి చేశారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోగా ఈవోను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు.


.webp)



