అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా!

 

 

 

రాముడు: లక్షణా..

లక్ష్మణుడు: ఏంటన్నయ్యా?


రాముడు: గోదావరి అవతల, గోదావరి ఇవతల ఏంటి హడావిడిగా వుంది?


లక్ష్మణుడు:  రెండుపక్కల నుంచీ ‘భద్రాచలం మునగాల.. భద్రాచలం మునగాల’ అనే నినాదాలు వినిపిస్తున్నాయన్నయ్యా..


రాముడు: భద్రాచలం మునగాలా? ఇదెక్కడి కోరిక లక్ష్మణా.. ఇప్పటికే ప్రతి ఏడాదీ వరదలొచ్చినప్పడు భద్రాచలం ఎలాగూ
మునిగిపోతోంది కదా.. మళ్ళీ ఇప్పడు ప్రత్యేకంగా భద్రాచలం మునగాలని కోరికెవరికి పుట్టింది?


లక్ష్మణుడు: భద్రాచలం మునగాల అంటే అర్థం అది కాదన్నయ్యా.. భద్రాచలం అండ్ మునగాల అన్నమాట.


రాముడు: ఓహో.. మనం ఉన్న భద్రాచలం, మన పక్కనే వున్న మునగాల గురించా..


లక్ష్మణుడు: అవునన్నయ్యా..


రాముడు: ఈ రెండు ఊళ్ళ పేర్ల గురించే ఎందుకలా నినాదాలు వినిపిన్నాయి?


లక్ష్మణుడు
: అదే అన్నయ్యా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని ఇటలీ సోనియాగాంధీ డిసైడ్ చేసింది కదా.. భద్రాచలం, మునగాల మాదంటే మాదంటూ తెలంగాణ, సీమాంధ్ర వాళ్ళు గొడవలు పడుతున్నారన్నమాట..


రాముడు: అదేంటి లక్ష్మణా.. మనిద్దరిలా అంటే రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ముల్లా కలసిమెలసి వుండే వీళ్ళమధ్య విభేదాలు ఎందుకొచ్చాయో...


లక్ష్మణుడు: విభజనవాదులని ఉన్నార్లే అన్నయ్యా.. వాళ్ళు కట్టుకున్న పుణ్యమిది.


రాముడు: భద్రాచలం మునగాల.. భద్రాచలం మునగాల అంటూ చివరికి ఇద్దరూ మునిగిపోతారేమో!


లక్ష్మణుడు
: బాగాచెప్పావన్నయ్యా..


రాముడు: వీళ్ళు భలేవాళ్ళు లక్ష్మణా.. మనం కావాలని ఇద్దరూ కోరుకుంటున్నారుగానీ, మనలాగా కలసిమెలసి వుండాలని మాత్రం అనుకోవడం లేదు..


లక్ష్మణుడు: అవునన్నయ్యా.. అది సరేగానీ, నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరివైపు వుండాలని అనుకుంటున్నావన్నయ్యా?


రాముడు: నేను భద్రాచల రాముణ్ణి.. అందరి బంధువుని!