TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం

Published on: Sun Jul 20, 2014 3:32PM

హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల్లో ఆదివారం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. దీనిని కరీంనగర్ వాసి శ్రీనిధి అనే విద్యార్థిగా గుర్తించారు. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత మరో మృతదేహం బయటపడటం గమనార్హం. ఇప్పటి వరకు బియాస్ నదిలో 22 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా ఇద్దరు విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి వుంది.