TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు.!

Published on: Wed Aug 19, 2026 10:13AM

బీసీల సామాజిక, రాజకీయ సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందకుపోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు.     రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ   కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయానికిఅసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.  ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ జనాభాలో   50.42శాతానికి పైగా  ఉన్న బీసీ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సరైన ప్రాతినిధ్యం కల్పించడమే తమ  ధ్యేయమన్నారు.

గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.   ఆ చారిత్రక తప్పిదాన్ని సవరిస్తూ, 2024 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం మేరకు   గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం  రిజర్వేషన్లు పట్టణ స్థానిక సంస్థల్లో  33.33శాతంరిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 

దీనికితోడు..  మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ల ఎన్నికలను ఇకపై పరోక్ష పద్ధతిలో కాకుండా నేరుగా  ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే.. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా ప్రస్తుతమున్న 13 జిల్లా ప్రజా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా విస్తరిస్తూ  కేబినెట్ ఆమోదం తెలిపింది.   దీనివల్ల స్థానిక పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని, కొత్తగా వేలాది మందికి రాజకీయ వేదికలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.

16వ ఆర్థిక సంఘం నుంచి రావలసిన  2 వేల 300 కోట్ల రూపాయల గ్రామీణ నిధులు, 1,562 కోట్ల రూపాయల పట్టణ అభివృద్ధి నిధులతో పాటు మొత్తం  12,150 కోట్ల రూపాయల కేంద్ర నిధులు రాష్ట్రానికి సకాలంలో అందాలంటే అక్టోబరు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడం అత్యంత ఆవశ్యకమని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణను అడ్డుకోవడానికి ఎవరైనా కోర్టుల్లో కేసులు వేస్తే వారు  చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు హెచ్చరించారు.

 BC Reservations, 34 percent, Chandrababu Naidu,  Assembly, AP Local Body Elections, Direct Mayor Elections,  AP Cabinet Decisions