బాలాపూర్ లడ్డూ రూ.9.26 లక్షలు

 

Balapur Ganesh laddu auction, Ganesh Visarjan 2013, Balapur Ganesh, Balapur Ganesh laddu,

 

 

బాలాపూర్ వినాయకుడు అంటేనే హైదరాబాద్ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణ. అత్యంత పెద్దదయిన ఖైరతాబాద్ వినాయకుడి తరువాత రాష్ట్రంలో ఆతరువాత ఎక్కువగా ఆకర్షించేది బాలాపూర్ వినాయకుడే. బాలాపూర్ లడ్డూ వేలమే ఆ వినాయకుడికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ప్రతి ఏటా ఈ గ్రామస్తులే ఆ లడ్డూను దక్కించుకుంటారు.


ఈ సారి దానికి భిన్నంగా రూ.9.26 లక్షలకు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది ఈ లడ్డూ రూ.7.5 లక్షల రూపాయలకు గ్రామస్తుడు దక్కించుకున్నారు. ఈ లడ్డూను దక్కించుకుని పొలంలో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని, ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయని ప్రతీతి. రియల్ ఎస్టేట్, రియల్ భూం నేపథ్యంలో మిగత చోట్ల ఇంతకంటే ఎక్కువ ధరకు లడ్డూలు వేలంలో అమ్ముడుపోయినా..బాలాపూర్ లడ్డుకు మాత్ర ఆ మచ్చ అంటలేదు.