Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలయ్య డైరెక్షన్ లో న్యూ కాన్సెప్ట్‌తో 100వ ఫిల్మ్!
posted on: Feb 5, 2013 4:09PM

నందమూరి బాలకృష్ణ తన శ్రీమన్నారాయణ చిత్రం తరువాత మళ్ళీ ఇంతవరకు కొత్తగా ఏ సినిమా ఒకే చేయలేదు. ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు ఆయన త్వరలో ఒక జానపద సినిమాలో నటించబోతున్నారు. బాలయ్య బాబు అభిమానులకు సంతోషం కలిగించే మరో ఆసక్తికరమయిన వార్త ఏమిటంటే ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తారని సమాచారం.
‘సింహా,’ ‘శ్రీ రామ రాజ్యం’ సినిమాలలో బాలకృష్ణ సరసన నటించిన నయనతార ఈ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో వారిద్దరూ మహారాజు, మహారాణీ పాత్రలు పోషిస్తారని సమాచారం. ఇక, ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ‘శ్రీరామరాజ్యం’ సినిమాను నిర్మించిన ఎలమంచిలి శివాజీ నిర్మిస్తారని సమాచారం. బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా షూటింగు మొదలవవచ్చునని సమాచారం. అయితే, ఈ విషయాన్నిఇంకా సంబందిత వ్యక్తులు ధృవీకరించవలసి ఉంది.






