దక్షిణాఫ్రికా 255/2 : రాణించిన కల్లిస్, ఆమ్లా

Publish Date:Nov 9, 2012

 Australia vs South Africa, South Africa dominate Australia, Australia South Africa Brisbane Test, South Africa tour Australia

 

ఆస్ట్రేలియాతో తోలి టెస్ట్ ను దక్షిణాఫ్రికా ఘనంగా ప్రారంభించింది. ఆమ్లా 90 బ్యాటింగ్, కలిస్ 84 బ్యాటింగ్ తో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు తొలి రోజు ఆట ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేశారు.


ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆమ్లా రెండు కీలక భాగస్వామ్యాలు జోడించాడు. పచ్చిక వికెట్ మీద స్వింగ్, పేస్‌లతో చెలరేగుతారనుకున్న కంగారులు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రెండో వికెట్‌కు పీటర్సన్‌తో కలిసి 90, కలిస్‌తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు.62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను అటు వికెట్ కీపర్, ఇటు ఫస్ట్ స్లిప్ లియోన్ అందుకోలేకపోయారు. కలిస్ కూడా 42 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సిడిల్ వేసిన బంతి టీవీ రిప్లేలో నోబాల్‌గా తేలింది. ఆసీస్ బౌలర్లలో ప్యాటిన్సన్, లియోన్ చెరో వికెట్ తీశారు.