TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'అత్తారింటికి దారేది' పైరసీ: పవన్ అభిమానుల ఆగ్రహం

Published on: Mon Sep 23, 2013 3:10PM

 

 Attarintiki Daredi piracy, Attarintiki Daredi Movie Leaked, pawan kalayn fans

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా రిలీజ్ కాకముందే బయటకి లీక్ అవడంతో ఆయన అభిమానులు షాక్ గురిచేసింది. దీనికి కారకులైన వారిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని ఓ సీడీ షాపుపై దాడి సీడీలనూ ధ్వంసం చేశారు. పోలీసులు కూడా విజయవాడ నగరంలోని అనుమానిత సీడీ షాపులపై దాడి చేసి కంప్యూటర్లు, లాప్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు.

 

 

ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుతూ...పవర్ స్టార్ దెబ్బ తీయడానికే కావాలని ఈ సినిమాను ఎవరో బయటకు లీక్ చేశారని ఆరోపించారు. ఎలాంటి ఎన్ని కుట్రలు చేసిన పవర్ స్టార్ ని ఎవరూ తోక్కలేరని అభిమానులు అన్నారు. పవర్ స్టార్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా పెడనలో 'అత్తారింటికి దారేది'  పైరసీ సీడీ మార్కెట్లో లభ్యమయిన విషయం తెలిసిందే.