ఏపీ ఎన్జీవో భూములపై కేసిఆర్ కు హైకోర్ట్ షాక్
Published on: Mon Jul 7, 2014 3:44PM
.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయి. భూమిని నమ్మున్న రైతుల రుణాలను మాఫీ చేస్తానని ఆయన ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలులో జాప్యం చేయడం తెలంగాణ రైతాంగంలో ఆయనకి గౌరవాన్ని సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే తాజాగా ఏపీ ఎన్జీవోలు ఈ అంశం మీద హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని, దీనిమీద నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఈరకంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం షాక్ తిన్నది.


