టెన్త్ పరీక్ష పేపర్ లీకేజ్.. ప్రధాన నిందితులు అరెస్ట్...
Published on: Fri Mar 31, 2017 12:33PM

ఏపీ అసెంబ్లీలో టెన్త్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష, అధికార పక్షనేతల మధ్య వాగ్వాదం తారాస్థాయలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ లీకేజ్ లో ప్రధాన నిందితులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుల కోసం ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నామని.. వీరిని నేడు లేదా రేపు మీడియా ఎదుట హాజరు పరిచి మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.


