నా జీవితం నా చేతుల్లోనే: నటి అంజలి
Published on: Sun Apr 14, 2013 12:34PM

“నా లైఫ్ ఇక నా చేతుల్లోనే ఉంది. గత ఐదు రోజులుగా నా జీవితంలో అనుకోని సంఘటనలు జరిగాయి. నా వల్ల ఇబ్బందిపడ్డ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఇక నా సినీ, వ్యక్తిగత జీవితం అంతా నా చేతుల్లోనే ఉంది. దర్శకుడు, నిర్మాతలు, నటులకు అందరికీ క్షమాపణలు చెబుతున్నా..సోమవారం నుండి “‘బోల్ బచ్చన్” షూటింగ్ పాల్గొంటా. ఇక నాదృష్టి అంతా సినిమాలమీదనే” ప్రముఖ నటి అంజలి తెలిపింది. ఆమె కిడ్నాప్ వ్యవహారం ముగియడంతో ఈ సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడింది. తన కుటుంబ సభ్యులు జరిగిన సంఘటనల వల్ల ఆందోళన చెందారని, సోమవారం నుండి షూటింగ్ వెళ్తానని తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ మహారాష్ట్రలో జరుగుతుంది.


