TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బస్సు ప్రమాదం: రాష్ట్రానికి చెందిన మృతులు వీరే

Published on: Wed Oct 30, 2013 11:56AM

 

Volvo bus accident, Andhra volvo bus fire accident, Volvo bus catches fire, 42died

 

 

మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తపేట మండలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు ఫరూఖ్ అలీ - నాచారం(హైదరాబాద్), అక్షయ్‌సింగ్ - ఆర్టీసీ క్రాస్‌రోడ్(హైదరాబాద్), సురేష్‌బాబు-శ్రీనగర్ కాలనీ(హైదరాబాద్), చంద్రశేఖర్- కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్), టి.సురేష్- మచిలీపట్నం(కృష్ణా జిల్లా), అడారి రవి - నర్సీపట్నం(విశాఖ జిల్లా), వేదవతి - కామారెడ్డి మండలం దేవునిపల్లి ( నిజామాబాద్ జిల్లా), గాలి బాల సుందర్‌రాజు, గాలి మేరి, గాలి విజయకుమారి - నర్సారావుపేట(గుంటూరు జిల్లా).

 

మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బుధవారం ఉదయం ప్రైవేట్ వోల్వో బస్సు మంటల్లో కాలిపోయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రమాదం సంభవించింది. మృతుల కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 110 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది