ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్న అమితాబ్
Published on: Fri Apr 12, 2013 11:08AM

2011 సంవత్సరానికి నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రదానం చేసింది. హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో జరిగిన ఈ వేడుకలో సీఎం కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్న అమితాబ్‌బచ్చన్ మాట్లాడాతు...తన దృష్టిలో అతిగొప్ప జాతీయ సమైక్యత సాధనం సినిమాయేనని అమితాబ్ బచ్చన్ తెలిపారు. "తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. తెలుగునేల కన్నబిడ్డ నందమూరి తారకరామారావు. ఆయన పేరుమీద ఏర్పాటు చేసిన అవార్డును నేనందుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరికీ చక్కటి సాన్నిహిత్యం ఉండేది. ఆయన సినిమాలను నేను హిందీలో రీమేక్ చేసేవాడిని. నా సినిమాలను ఆయన తెలుగులో రీమేక్ చేసేవారు. పరస్పరం సలహాలు ఇచ్చిపుచ్చుకునేవాళ్లం. భారతీయ సినిమా వందేళ్ల పండుగను చేసుకుంటున్న సమయంలో మనం దాదాసాహెబ్‌ని గుర్తుచేసుకోవాలి. 'హరిశ్చంద్ర' సినిమాను గుర్తుచేసుకోవాలి'' అన్నారు.


