అల్లరి నరేష్ ‘జంప్ జిలానీ’
Published on: Tue May 14, 2013 11:20AM
.jpg)
తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించే అల్లరి నరేష్ మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాను నటించిన కొత్త సినిమా ‘యాక్షన్’ విడుదలకు సిద్ధమవుతుండగా ‘జంప్ జిలానీ’ చేయడానికి కామిటయ్యాడు. తమిళ్ లో సుందర్.సి దర్శకత్వంలో వచ్చిన 'కల కలప్పు' సినిమాని తెలుగులో అల్లరి నరేష్ హీరోగా, ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మాత అంబికా కృష్ణ నిర్మించనున్నారు.నరేష్, సత్తిబాబుల కాంబినేషన్లో బెట్టింగ్ బంగార్రాజు, యముడికి మొగుడు సినిమాలు రూపొందాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.


