TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముద్దులిస్తా.. బికినీ వేస్తా: అలియా భట్

Published on: Thu Apr 10, 2014 4:30PM

 

సినిమాల్లో హీరోలకి ఎన్ని ముద్దులు ఇవ్వడానికైనా తనకి ఎంతమాత్రం అభ్యంతరం లేదని బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సిగ్గుపడకుండా చెప్పేసింది. అలాగే బికినీ వేసుకోవడంలో కూడా తనకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా కుర్రాళ్ళకి నచ్చే ఈరకం హాట్ కామెంట్లు చేసింది.

 

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురైన అలియా తాను పెళ్ళి విషయంలో తన తండ్రి నడిచిన బాటలోనే నడుస్తానని చెప్పింది. తన తండ్రి ఆయన తండ్రికి చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాడని, తాను కూడా తన తండ్రికి చెప్పకుండానే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. బాలీవుడ్‌లో ఎంటరై చాలా తక్కువకాలమే అయినా అలియాభట్ తన అందచందాలతో కుర్రకారుని అల్లాడిస్తోంది.



ఆమె నటించిన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాలో మొత్తం 21 ముద్దు సీన్లలో నటించిన కుర్రాళ్ళ గుండెల్ని ఛిద్రం చేసింది. అలాగే ఆ సినిమాలో బికినీ వేసుకున్న అలియాని చూసి కుర్రకారు హోల్‌సేల్‌గా కిర్రుమన్నారు. ముద్దుల విషయంలో, బికినీ విషయంలో ఎంతమాత్రం మొహమాటపడనని చెప్పిన అలియా బట్టలు లేకుండా నటించమంటే మాత్రం తనవల్ల కాదని చేతులెత్తేసింది. అబ్బో... పిల్లకి ఎంత సిగ్గో!