అక్బరుద్దీన్ ఓవైసీకి 5 రోజుల పోలీస్ కస్టడీ
Published on: Fri Jan 11, 2013 5:43PM
.jpg)
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టై అదిలాబాద్ సబ్ జైలులో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీకి ఐదు రోజులపాటు పోలీస్ స్టడీ విధిస్తూ నిర్మల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్బర్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పెట్టుకున్న పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును మధ్యాహ్నానికి వాయిదా పడింది. భోజన విరామం అనంతరం న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
అక్బరుద్దీన్ ఓవైసీకి శుక్రవారం కడుపు నొప్పి వచ్చింది. జిల్లా జడ్జి మధుసూదన్ మధ్యాహ్నం జైలును సందర్శించారు. ఈ సమయంలో అక్బరుద్దీన్ తనకు కడుపు నొప్పి వచ్చిందని జడ్జికి తెలియజేశారు. దీంతో ఆ జడ్జి వెంటనే రిమ్స్ వైద్యులను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్బరుద్దీన్‌కు వైద్యులు చికిత్స అందించారు.


