TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నటి అంజలి దేవి కన్నుమూత

Published on: Mon Jan 13, 2014 2:43PM

 

 

ప్రముఖ నటి అంజలి దేవి చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆమె చెన్నైలోని విజయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. 1927 ఆగస్టు 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె మూడువందలకు పైగా చిత్రాల్లో నటించారు. లవకుశ, సువర్ణ సుందరి, అనార్కలీ, బడిపంతులు, బోగి మంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందారు. అంజలీ దేవి భర్త ఆదినారాయణ రావు సంగీత దర్శకులు.