లవ్ మ్యారేజ్ చేసుకున్న 'ప్రేమిస్తే' భరత్
Published on: Wed Sep 11, 2013 2:46PM

ప్రేమిస్తే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరో భరత్ ఓ ఇంటి వాడయ్యాడు. జెస్సీ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మంగళవారం ఉదయం చెన్నైలోని గిండీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం జరిగింది. దుబాయ్ లో డెంటిస్ట్ గా ఉన్న జెస్సీ ఓ స్నేహితుడి ద్వారా భరత్ కి పరిచయమయింది. ఆ పరిచయం తరువాత ప్రేమగా మారింది. తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు భరత్ కాగా ..జెస్సీ క్రిస్టియన్. ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించడంతో వీరి వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. వీరిద్దరి వివాహ రిసెప్షన్ ఈ నెల 14న చెన్నైలో జరగనుంది. బాయ్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన భరత్ ఆ తరువాత ప్రేమిస్తే సినిమాతో మరింత పేరు తెచ్చుకున్నాడు.


