TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీనివాసరెడ్డి బదిలీపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బాబు

Published on: Sat Apr 7, 2012 3:26PM

శనివారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీనివాసరెడ్డి బదిలీపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల కేసులో అవినీతి పరులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఏసీబీ విచారణను సర్కార్ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. హైకోర్టుకు నివేదిక సమర్పించే సమయంలో అధికారిని బదిలీ చేయటం సరికాదన్నారు. అవినీతిపరులను రక్షించేందుకు ప్రభుత్వం బదిలీల పేరుతో నాటకం ఆడుతోందన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారుల ఆత్మస్థైర్యాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు.

 

అయితే ప్రభుత్వ అధికారులకు బదిలీలు సర్వసాధారణమేనని ఎసిబి నుంచి రిలీవ్ అయిన శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేశానని ఆయన మీడియాతో అన్నారు. మద్యం కేసులకు సంబంధించి ఒక నివేదిక పూర్తి అయ్యిందని, మరో నివేదికను రూపొందిస్తున్నామన్నారు. 16వ తేదీలోగా హైకోర్టుకు అందజేస్తామన్నారు.తన బదిలీ వెనుక రాజకీయ కుట్ర ఉందని తాను భావించట్లేదన్నారు. ఈ ఆరోపణలపై తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు.