జాతీయ అవార్డుల్లో ఈగ సంచలనం
Published on: Mon Mar 18, 2013 5:58PM

2012 ఏడాదికి గాను జాతీయ చలనచిత్ర పురస్కారాలను జాతీయ చలన చిత్ర అవార్డుల కమిటీ ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఈగ సంచలనం సృష్టించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'ఈగ' ఎంపికైంది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రంగా కూడా 'ఈగ'కు అవార్డు లభించింది. ఉత్తమ జాతీయ చిత్రంగా 'కహానీ' ఎంపికైంది. ఉత్తమ నటుడు ఇర్ఫాన్ఖాన్కు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు ఇళయరాజాకు అభించింది.
అవార్డుల వివరాలు :
ఉత్తమ జాతీయ చిత్రం - కహానీ
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - ఈగ
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - ఈగ
ఉత్తమ హిందీ చిత్రం - పాన్‌సింగ్ తోమర్
ఉత్తమ నటుడు - ఇర్ఫాన్ ఖాన్(పాన్‌సింగ్ తోమర్)
ఉత్తమ నటి - ఉషా జాదవ్(దాగ్ - మరాఠీ)
ఉత్తమ గాయని - సంహిత(మరాఠి)
ఉత్తమ గాయకుడు - శంకర్ మహాదేవన్(చిట్టగాంగ్)
ఉత్తమ పాట- ప్రసూన్ జోషి (చిట్టగాంగ్ )
ఉత్తమ సహాయ నటుడు- అనూకపూర్( విక్కీ డోనర్)
ఉత్తమ సహాయ నటి - డాలి అహ్లువాలియా(విక్కీ డోనర్)
ఉత్తమ సంగీత దర్శకుడు - ఇళయా రాజా
ఉత్తమ జనరంజిక చిత్రాలు - విక్కీ డోనర్ (హిందీ), ఉస్తాద్ హొటల్ (మళయాళం)
ఉత్తమ బాల నటుడు- వీరేంద్ర ప్రతాప్(హిందీ), మీనన్(మలయాళం)
ఉత్తమ డైలాగ్స్- అంజలీ మీనన్(ఉస్తాద్ హోటల్- మలయాళం)
ఉత్తమ కళా దర్శకత్వం - విశ్వరూపం
స్పెషల్ జ్యూరీ అవార్డులు - చిత్రాంగద(బెంగాలీ), కహానీ, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, దేఖ్ ఇండియన్ సర్కస్, తలాష్


