యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్..
Published on: Sat Mar 11, 2017 9:46AM

ఉత్తరప్రదేశ్ లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ తన విజయ ఢంకా మోగించింది. రెండు రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ... యూపీలో బీజేపీనే అధికారం చేజిక్కించుకుంది. స్పష్టమైన ఆధిక్యాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్నది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 285 స్థానాల్లో లీడింగ్ ఉండి మేజిక్ ఫిగర్ ను సైతం దాటేసింది. మిగిలిన పార్టీలు సమాజ్ వాదీ పార్టీ 66, కాంగ్రెస్ 1, బీఎస్పీ 28 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఈ సందర్భంగా అప్పుడే యూపీలో బీజేపీ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటున్నారు.


