TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

411 పాఠశాలల బస్సుల సీజ్ చేసిన ఆర్టిఏ

Published on: Sun Jun 24, 2012 11:33AM

411 school buses seized, school buses seized, Private travels seized, Travel buses seized by RTAనిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్, పాఠశాలల బస్సులను నిలువరించే కార్యక్రమాన్ని రవాణా శాఖాధికారులు ఉధృతంగా కొనసాగిస్తున్నారు. శనివారం నాటికి 411 స్కూలు బస్సులు, 211 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. దాడుల నేపథ్యంలో మరో 500 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆయా సంస్థల యజమానులు రోడ్లపైకి తీసుకురాకుండా నిలిపివేశారు. ఒక్క శనివారమే ఎనిమిది జిల్లాల్లో వివిధ ట్రావెల్స్‌కు చెందిన 10 బస్సులను, వివిధ పాఠశాలలకు చెందిన 99బస్సులను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన విద్యా సంస్థల బస్సుల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో(22) ఉన్నాయి.