బాలికని చంపిన రాకాసి కోడిపుంజు...
Published on: Mon Aug 4, 2014 10:37PM
ఎనిమిది నెలల చిన్నారి జాహ్నవిపై కోడిపుంజు దాడిచేసి పొడవడంతో అస్వస్థతకు గురై మృతిచెందింది. నల్గొండ జిల్లా మునుగోడు లక్ష్మీదేవి గూడానికి చెందిన కొంపల్లి సైదులు గీతల కుమార్తె అయిన జాహ్నవికి జ్వరం రావడంతో తల్లి గీత మందు పట్టించి మూతను శుభ్రం చేయడానికి బయటకు వెళ్లింది. ఇంతలో అక్కడున్న కోడిపుంజు ఆడుకుంటున్న జాహ్నవిపై దాడి చేసి తలపై పొడిచింది. దీంతో జాహ్నవి తలపై నుంచి రక్తం కారడంతో చిన్నారిని స్థానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు జాహ్నవి తల్లిదండ్రులు. అయితే పాప శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందని హైదరాబాద్ తీసుకెళ్లాలని స్థానికి వైద్యులు సూచించగా జాహ్నవిని హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి చనిపోయింది.


