TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డబ్బు పంపిణీల్లో వై.కా.పా. ముందంజ!

Published on: Mon Jun 11, 2012 1:13PM

ysr congress money distribution, ap byelections ysr congress money, ysr congress note for vote, ysr congress money for vote, ap byelections 2012, ap bypolls 2012, ap bypolls 2012 cash for vote ఎన్నికల అక్రమాల్లో కాంగ్రెస్, టిడిపిల కన్నా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పత్రిక సర్వేల్లో ఈ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని చెప్పినప్పుడు అక్రమాల్లోనూ ఇదే ముందుంటుందని పరిశీలికులు ఎప్పుడో అనుమానించారు. వీరి అంచనాలకు తగ్గట్టే మూడు రోజులు ముందుగానే ఈ పార్టీ డబ్బును పంపిణీ చేసింది. అనంతపురంలోని పాతూరు చెరువుగట్టు కింద, శారదానగర్, ఎర్నాల కొట్టాల్లో వై.కా.పా. నేతలు ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలంలోనే ఓటర్లకు 15.50 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. కడప జిల్లాలోని సిద్ధవటం మండలంలో ఓటరుకు ఐదువందల రూపాయలు చెల్లించారు. నందులూరులోనూ ఓటరుకు ఐదొందల నోట్లు అందాయి. రాయచోటిలో ఓటుకు ఐదొందలు, ఇంటికి వెయ్యిరూపాయలు చొప్పున పంపిణీ జరిగింది. చీప్ లిక్కర్ పంపిణీలో వై.కా.పా. ముందుంది. ఆ పార్టీ అధినేత పర్యటనతో మొదలైన ఈ లిక్కర్ పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బళ్లారి కేంద్రంగా కర్ణాటక నుంచి డబ్బు, మద్యం రప్పించింది వై.కా.పా. అని పోలీసులకు అనుమానాలున్నాయి.