TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సచిన్ మొదటివాడు కాదు ...!

Published on: Mon Apr 30, 2012 2:05PM

పెద్దలసభ (రాజ్యసభ)కు ఎన్నికైన తొలిక్రీడాకారుడు అంటూ క్రికెట్ దిగ్గజం సచిన టెండూల్కర్ గురించి కొన్ని పత్రికలు ప్రత్యేక వార్తా కథనాలు రాయడం పట్ల క్రీడాభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి క్రీడా రంగం నుంచి ప్రధానంగా క్రికెట్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన క్రీడాకారులలో సచిన మూడోవాడు. తొలుత పటౌడి, ఆ తర్వాత సునీల్ గవాస్కర్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. వివిధ రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. నామినేట్ అయ్యే వీరికి కూడా ఇతర పార్లమెంట్ సభ్యుల మాదిరిగానే అన్ని హక్కులు, అధికారాలు వుంటాయి.

 

 

అయితే వీరు ఇతర పార్లమెంట్ సభ్యుల మాదిరిగా ప్రజాసమస్యలపై కీలకంగా వ్యవహరించడం లేదని కొంతమంది ఆరోపణలు చేస్తుండగా, వివిధ రంగాలకు చెందిన వారు ప్రముఖులైనప్పటికీ వారు రాజకీయ నాయకులు కారని, వారు రాజకీయాల కోసం ఎంపిక చేయలేదని, ఆయా రంగాలలో వారందించిన సేవలకు గౌరవ సూచకంగా మాత్రమే పార్లమెంటు సభ్యులుగా నియమితులయ్యారనే వారు వున్నారు. నామినేట్ అయిన సభ్యులు రాజకీయాలు మాట్లాడకపోయినా ప్రజలకు మేలు చేసే విధానపరమైన అంశాలు విషయంలో అయినా సలహాలు ఇస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.