సెంట్రల్ యూనివర్సిటీలో అర్థరాత్రి కలకలం, యువతి కిడ్నాప్ యత్నం
Published on: Fri Aug 31, 2012 11:39AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్థరాత్రి హై డ్రామా చోటుచేసుకుంది. ఎంసీఎ విద్యార్ధిని కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించడంతో కలకలం రేగింది. బాధితురాలు కేకలుపెట్టడంతో అమ్మాయిల హాస్టల్ నుంచి పెద్దఎత్తున మిగతా విద్యార్థినులు పరిగెత్తుకొచ్చి దుండగులమీద దాడిచేశారు. ఏదో గొడవ జరుగుతోంది చూద్దామని వచ్చిన మిగతా విద్యార్ధులంతా పెద్దఎత్తున పోగై దుండగులు వచ్చన కారుని ధ్వంసం చేసి, వాళ్లని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వాళ్లలో ఇద్దరు సెంట్రల్ యూనివర్సిటీ ప్రస్తుత విద్యార్ధులు, ముగ్గురు పూర్వవిద్యార్ధులు ఉన్నారు. చిత్తుగా తాగి, మత్తులో కనిపించిన అమ్మాయిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేవలం వందమంది సెక్యూరిటీ సిబ్బందితో ప్రాంగణం రక్షణ బాధ్యతల్ని పర్యవేక్షించలేమని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు.


