ఉత్తరాఖండ్ అల్లకల్లోల్లం
Published on: Sat Aug 16, 2014 9:50AM
.jpg)
భారీ వర్షాలు మరోసారి ఉత్తరాఖండ్‌ని అల్లకల్లోలం చేస్తున్నాయి. గతంలో ఓసారి ఉత్తరాఖండ్‌ని వణికించిన భారీ వర్షాలు మరోసారి తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఇప్పటి వరకు 20 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. నదులు పొంగి ప్రవహిస్తూ వుండటంతో రాష్ట్రం మొత్తం జలమయమైంది. వేలాది మంది ప్రజలు నీటిలో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్‌కి వెళ్ళిన అనేకమంది యాత్రికులు కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణం అనుకూలించడం లేదు.


