TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ప్లాన్ ఈసారైనా వర్కవుట్ అవుద్దా..?

Published on: Tue Mar 22, 2016 5:54PM


వైసీపీ పార్టీ నుండి ఎనిమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారిపై అనర్హత వేటు పడేలా చేయాలని చూసిన జగన్ ఎత్తులను అధికార పార్టీ ఎలాగొలా తిప్పికొట్టింది. అయితే ఇప్పుడు జగన్ వారిపై మరో అస్త్రాన్ని వాడబోతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ విప్ జారీ చేసింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా విప్ అందజేయాలని వైసీపీ నిర్ణయించింది. అంతేకాదు ఈసారి మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. వారిపై ఎలాగైనా అనర్హత వేటు పడేలా చేయాలని చూస్తున్నారు జగన్. దీనిలో భాగంగానే ఒకవేళ విప్ తీసుకోకుండా ఆ ఎమ్మెల్యేలు తప్పించుకోవాలని చూస్తే వారి క్వార్టర్స్‌‌కు వెళ్లి మరీ విప్ అందజేయాలని చూస్తున్నారంట. అందుకు స్యాక్ష్యాలు కూడా ఉండేలా చూస్తున్నారు.

 

వాస్తవానికి విప్ జారీ చేసిన తర్వాత ఆయా పార్టీలకు చెందిన సభ్యులు తప్పనిసరిగా సభకు రావాల్సి ఉంటుంది. పార్టీ ఆదేశం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సభకు హాజరుకాకపోతే వారిపై అనర్హత వేటు పడుతుంది. మరి జగన్ వేసిన ప్లాన్ ఈసారైనా వర్కవుట్ అవుతుందా.. లేక దానికి కూడా అధికార పార్టీ ఏదో ఒక ఎత్తుగడ వేస్తుందా చూడాలి..