టి ఆర్ ఎస్ ఆపీస్ లో సంబరాలు
Published on: Fri Feb 5, 2016 4:15PM

గ్రేటర్ లో టిఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది. నగరం నలువైపులా భారీ మెజారిటీతో ముందుకు దూసుకెళ్తోంది. వందకు పైగా స్థానాలు కైవసం చేసుకుని సొంతంగానే మేయర్ ను ఏర్పాటు చేసే దిశగా టిఆర్ఎస్ రెడీ అవుతోంది. ఇప్పటికే 102కు పైగా స్థానాల్లో పైగా టిఆర్ఎస్ ముందంజలో ఉంది. దీంతో గులాబీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఒక్క పాతబస్తీ మినహా, బల్దియా అంతా టిఆర్ఎస్ మోత మోగిస్తుండటంతో, కార్యకర్తలు భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, మిగిలిన పార్టీ ఆఫీస్ లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.


