TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతిలో రౌడీ షీటర్ హల్చల్

Published on: Sat Sep 13, 2025 10:55AM

 

తిరుపతిలో  ఓ రౌడీషీటర్ హల్చల్ సృష్టించారు. ఇరువురు మహిళలను కిడ్నాప్ చేసి మాట వినకపోతే చంపేస్తా.... అంటూ కత్తులతో  బెదిరించాడు దుండగుడు.  కిడ్నాప్ కు గురైన మహిళ తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది. దీంతో  శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న సీఐ రామకిషోర్ బృందం రౌడీషీటర్ కోసం దర్యాప్తు చేపట్టారు.  పోలీసులు కిడ్నాపర్ ను పట్టుకునే ప్రయత్నంలో  రెండు కార్లను,ద్విచక్ర వాహనాలను ఢీ కొడుతూ భయబ్రాంతులకు గురి చేస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు.   

ఎట్టకేలకు సినీ తరహాలో  వెంబడించి సీఐ బృందం పట్టుకున్నరు. తల్లి కూతుర్లను క్షేమంగా పోలీసులు ఇంటికి చేర్చారు.  నిందితుడు రౌడీషీటర్ ను అదుపులోకి....తీసుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లు అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ అజీమ్‌గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై గతంలో కూడా పలు కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు