ఎన్టీఆర్ తొందర పడుతున్నాడు

 

Ramayya Vastavayya release date,  NTR Ramayya Vastavayya, Ramayya Vastavayya release

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' మూవీ అనుకున్న డేట్ కంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రీపోన్ చేశారట. లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం...ఎన్టీఆర్ తొలి హిట్ సినిమా 'స్టూడెంట్ నెం. 1' సెప్టెంబర్ 27న విడుదలైంది. ఇదే రోజున 'రామయ్యా వస్తావయ్యా' ను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే దాని కంటే ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ సినిమాలో సమంత, శ్రుతిహాసన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu