చిరంజీవి పార్టీలోకి రారు..మాకు కార్యకర్తలు ఉన్నారు..
Published on: Tue Mar 14, 2017 5:05PM
.jpg)
జనసేన పార్టీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన సోదరుడు చిరంజీవీ పార్టీ ప్రేవశంపై మాట్లాడుతూ.. జనసేనలోకి చిరంజీవి వచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు. జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు..యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయించాం.. 60 శాతానికి మించి యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. డబ్బు ప్రభావం లేని రాజకీయాలంటే నాకు ఇష్టం..ధనప్రవాహం లేని రాజకీయాలు కావాలని తనకు కూడా ఉందని, అయితే అది ఎంతవరకు సాధ్యమో ప్రయత్నించి చూస్తే కానీ తెలియదని ఆయన అన్నారు. ఇంకా ప్రజా ఉద్యమ కారిణి ఇరోం షర్మిళ ఓటమి తనను బాధించిందని... ఈ సందర్బంగా తనకు గోపీచంద్ రాసిన కథ గుర్తుకొచ్చిందని.. తనవరకు వస్తే విలువలు ఉండవన్నది ప్రజలు నిరూపించినట్టు అనిపించిందని పవన్ పేర్కొన్నారు.


