థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరేం కాదు...

 

సినిమా థియేటర్లలో జాతీయ గీతంపై సుప్రీంకోర్టు మరోసారి కొత్త ఆదేశాలు జారీ చేసింది. గతంలో సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి అని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు గతంలో తాను ఇచ్చిన ఆదేశాలను సవరించింది. సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది. సినిమా థియేటర్లలో జాతీయ గీతంపై కేంద్రం సుప్రీంకోర్టును వినతి చేసింది. జాతీయ గీతాలాపన సమయంలో పౌరులు పాటించాల్సిన నియమనిబంధనల విషయంలో రాజ్యాంగంలో ప్రత్యేక సూచనలు లేవని కేంద్రం తెలిపింది. పౌరులు లేచినిలబడి గౌరవం చూపాలని చెప్పేందుకు తగిన చట్టంలేదని తెలిపింది. యుగీతం, జాతి ఔన్నత్యాన్ని చాటేటప్పుడు ఎవరినీ నిర్బం ధంగా గౌరవించలేము. ఒకవేళ ఎవరైనా అలా గౌరవం చూపేందుకు నిలబడకపోతే అటువంటి వారిని జాతివ్యతిరేకిగా పరిగణించలేము. అందుకవసరమైన చట్టం కూడా ఇప్పటి వరకు లేదు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా వ్యక్తం చేసింది. సినిమా థియేుటర్లలో జాతీయు గీతాలాపన సమయంలో తమ దేశభక్తిని చాటుకునేందుకు ప్రతి ఒక్కరూ లేచి నిలబడాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయుస్థానం పేర్కొంది. ఈ అంశంలో నిబంధనలను సవరించాలని కేంద్రానికి సూచించింది.