TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ఫోటో పెడితే ఊరుకోను..అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరిక

Published on: Sun May 25, 2025 7:10PM

 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో పెడితే ఊరుకోబోమని  సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే  ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఎవరైనా అధికారులు ఆయన ఫోటో పెడితే నడిరోడ్డుపై పగలగొడతామని హెచ్చరించారు. కొందరు ఉద్యోగులు గవర్నమెంట్ ఆఫీసులో జగన్ ఫోటో పెడితున్నారు. మీకు అభిమానముంటే మీ ఇళ్లలో పెట్టుకోవాలి ఆయన అన్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇలాంటి పనులు చేయొద్దు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావొస్తున్నా ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉండాల్సిన స్థానంలో మాజీ సీఎం జగన్ ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతున్నారు. ప్రధానంగా జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా జగన్ ఫోటోలు ఉండటంపై అనంత టీడీపీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ విధంగా జగన్ ఫోటోను ఉంచారంటూ జడ్పీ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా కూడా ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఫైర్ అయ్యారు. జడ్పీ చైర్ పర్సన్ ఛాంబర్‌‌లో కూడా మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచుతున్నారని, సీఎం చంద్రబాబు ఫోటోలు ఉంచడం లేదని విరుచుకుపడ్డారు