నామినేషన్ ప్రక్రియలో అపశృతి... మంత్రి కెటీఆర్ కు స్వల్పగాయాలు
Published on: Thu Nov 9, 2023 4:33PM
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియలో అపశ్రుతి చోటు చేసుకుంది. వాహనంపై నిల్చున్న మంత్రి కెటీఆర్ వెంటే ఆర్మూర్ బిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి ఉన్నారు. వీళ్లు ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు. ఎన్నికల ప్రచార వాహనం రెయిలింగ్ కూలి బీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి జీవన్ రెడ్డి, మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్ రెడ్డి తదితరులు వాహనం పైనుంచి కిందపడ్డారు. దీంతో కేటీఆర్కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. ప్రచార వాహనంపై ఉన్న రెయిలింగ్ ఆనుకుని బిఆర్ఎస్ నేతలు నిల్చోవడంతో బరువు ఎక్కువై రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా బిఆర్ఎస్ నేతలు పడిపోయారు. పాత ఆలూరు రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆ వాహనం స్పీడ్ గా ముందుకు వెళ్తోంది. ఇంతలో అక్కడ కరెంటు తీగ అడ్డుగా ఉండటంతో వారి వాహనానికి ముందు ఉన్న వాహనాన్ని సడన్ గా ఆపివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


