TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కు శవరాజకీయాలంటేనే ఇష్టమా?.. ఎందుకని?

Published on: Sun Jun 22, 2025 10:09PM

జగన్ కి శవరాజకీయాలే కలిసివస్తున్నాయా అంటు? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. జగన్ తండ్రి మరణం ద్వారా  వెలుగులోకి వచ్చారు.   వైఎస్సార్ బతికి ఉంటే ఆయన రాజకీయాల్లో ఇంతగా కనిపించేవారు కారని అంటారు.  వైయస్ చనిపోవడంతో గుండె ఆగి చనిపోయారని కొందరిని   ఎంపిక చేసుకుని జగన్   ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. ఇక్కడా మరణాలే జగన్ రాజకీయ ఎదుగుదలకు సోపానాలుగా పని చేశాయి. 

ఆపై 2014లో జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిగా భారీ ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కున్నారు. కానీ, ఏమంత రాణించలేక పోయారు. కారణం 'చావుల వాసన' ఎక్కడా లేక పోవడమేనంటారు.  కట్ చేస్తే 2019 ఎన్నికల ముందు మార్చి 15న వైఎస్ వివేకా హత్య  నింద మొత్తం నాటి బాబు ప్రభుత్వం మీద వేసి, ఎలాగోలా ఆ సెంటిమెంటుతో నెగ్గుకొచ్చేశారు. 

అంతేనా,  అదే ఎన్నికల ముందు.. 'డెడ్ లైన్'  పాలిటిక్స్ ప్లే చేశారు. ఇక్కడ ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలను రాజీనామా చేయిస్తానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారు.  ఆ నాటి ఎన్డీఏ నుంచి టీడీపీ కూడా బయటకొచ్చేలా చేసి నానా యాగీ చేశారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి, ఆ తర్వాత ఆ ప్రత్యేక హోదాను పక్కన పడేశారు. 

కట్ చేస్తే.. అధికారం పోయింది. ఇప్పుడాయన  కేవలం పులివెందుల ఎంపీ. కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. అయినా సరే  చావులెక్కడ ఉంటే అక్కడ వాలిపోతుంటారని  అంటారు. తన పాత కాలపు డెడ్లీ పాలిటిక్స్ కి జగన్ తెరలేపారు. అందులో భాగంగా   ఇటీవలి  పాపిరెడ్డిపల్లె ఘటనలోనూ ఒక అభిమాని చనిపోయారంటూ నానా హంగామా చేశారు. కట్ చేస్తే  రెంటపాళ్లలోనూ నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త చనిపోయిన ఏడాది తర్వాత ఓదార్చడానికి వెళ్తే.. అక్కడ మరో వ్యక్తి దుర్మరణం. సింగయ్య అనే ఒక వ్యక్తి జగన్ కారు కింద పడి మరణించడంతో.. ఆ కారు తోలిన డ్రైవర్ ని విచారిస్తున్నారు పోలీసులు.  జగన్ జీవితంలో ఎటు చూసినా ఈ రక్తసిక్త అధ్యాయాలు కనిపిస్తాయని అంటున్నారు విశ్లేషకులు.