TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ లో వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్.!

Published on: Wed Jul 29, 2026 9:59AM

హైదరాబాద్ నగరంలో బుధవారం (జులై 29) కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఉదయం విశ్వనగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి.. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.  ఉదయం నుంచే  దట్టమైన మేఘాలు అలుముకుని తుఫాను వాతావరణం నెలకొంది. చూస్తుండగానే భారీ వర్షం కురిసింది.  

దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో   రహదారులు జలమయమయ్యాయి.  వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు   రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌ ప్రాంతంలో గరిష్టంగా 82.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  కూకట్‌పల్లిలో 76.0 మిల్లీమీటర్లు, శేరిలింగంపల్లిలో 68.4 మిల్లీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 71.2 మిల్లీమీటర్లు, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో 65.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.  

రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో  పంజాగుట్ట, లక్డీకాపూల్, ఎల్బీనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట్ అండర్‌పాస్ మరియు మలక్‌పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్   స్థంభించిపోయింది.  వచ్చే 48 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

 Heavy Rain in Hyderabad, GHMC DRF Alert, IMD Telangana Forecast, Hyderabad Traffic Updates, Waterlogging In Hyderabad