రాజ్కోట్ వన్డే: ఇండియా టార్గెట్ 326

Publish Date:Jan 11, 2013

 

 

England set 326-run target for India, India vs England 2013, India vs England Rajkot 2013

 

 

రాజ్ కోట్ లో ఇండియా తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఇయాన్ బెల్ ఇండియా బౌలర్లను ఆటాడుకున్నారు. మొదటి వికెట్ కి వీరిద్దరూ 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

 

ఇయాన్ బెల్ (85) పరుగులు చేయగా, అలిస్టర్ కుక్ (75) పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆతరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇయాన్ మోర్గాన్, పీటర్సన్‌లు బాగా ఆడినప్పటికీ అర్ధసెంచరీలలు చేయలేక పోయారు.మోర్గాన్(41), పీటర్సన్(44) పరుగులు చేసి అవుటయ్యారు. అనతరం బ్యాటింగ్ కు దీగిన పటేల్, క్రెయిగ్ కీష్టెట్టర్ ఇండియా బౌలర్లను అదరగొట్టారు. పటేల్ 20 బంతుల్లో 44 పరుగులు చేశారు. క్రెయిగ్ కీష్టెట్టర్ 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.