TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అయేషా హత్య కేసు.. హైకోర్టు సంచలన తీర్పు..

Published on: Fri Mar 31, 2017 2:53PM


అయేషా మీరా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును నిర్దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం... అయోషా మీరా హత్య కేసు జరిగి దాదాపు ఎనిమిదేళ్లు అయిపోయింది. ఈ హత్య అప్పుడు ఉమ్మడిగా ఉన్న ఏపీ రాష్ట్రంలో పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబుకు అప్పట్లో  విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదును విధించింది. దీనిపై సత్యం బాబు హైకోర్టులో అపీలు చేశాడు. ఇప్పుడు తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు.. ప్రాసిక్యూషన్ వాదనలు అతడే దోషని నిరూపించడం లేదని అభిప్రాయపడింది. అంతేకాదు  ఆధారాలు లేకుండా ఎనిమిదేళ్ల పాటు సత్యంబాబును జైల్లో పెట్టారని.. సత్యంబాబుకు రూ. లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.